- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాంగ్..పార్కింగ్
దిశ, న్యూస్ బ్యూరో: రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పే పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారు. సిటీలో రద్దీగా ఉండే రోడ్లపై తరచూ ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. పార్కింగ్ స్థలాలు లేకుండా ఉన్న షాపింగ్ మాల్స్, దుకాణాలపై చర్యలు తీసుకునేవారు కనిపించడం లేదు. రోడ్ల పక్కనే పార్కింగ్ చేసి తమ పనుల కోసం వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో పలు చోట్ల ‘ నో పార్కింగ్’ ఏరియాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ జోన్లలో పార్క్ చేసిన వెహికల్‌పై రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరికలు కూడా ఉంటాయి. సిటీలో చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసులు తరచూ ఛలాన్లు రాస్తుంటారు. ఒక్కోసారి ఛలాన్ల కోసమే ప్రత్యేక డ్రైవ్‌లు సైతం నిర్వహిస్తుంటారు. అయితే ఈ ‘నో పార్కింగ్’ జోన్లను పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. పోలీసులే నేరుగా అక్కడ వెహికల్ పార్కింగ్ చేసి వెళ్లిపోతున్నారు. తమకు ఎవరు ఫైన్ వేస్తారనే ధైర్యమో.. లేక అడ్డు చెప్పేవారు లేరనో ఇలా వ్యవహరిస్తున్నారు. హిమాయత్‌నగర్ రోడ్డులో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ముందు TS09PA2158 నెంబర్ గల పోలీసు వాహనం ‘నో పార్కింగ్’ బోర్డు ముందు వదిలేసి వెళ్లారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి, అమలు చేయించాల్సిన వారే ఇలా ఉల్లంఘిస్తే ఎలా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ పోలీసులు నిబంధనలను పలుమార్లు ఉల్లంఘించి విమర్శల పాలయ్యారు. అయినా వారిలో మార్పు రావడం లేదు.
Tags: Traffic, hyderabad,parking, police, challan