జనగామ జిల్లా కు ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్ మంజూరు…

by Shyam |
jangan-police-station 1
X

దిశ, జనగామ: జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరైనట్లు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలియజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివరాలను వెల్లడించారు. జిల్లా వాసుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కల నెరవేరిందని, జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పోలీస్ సిబ్బంది మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ తమ వాహనాల పై ఉన్న చలానాలను తప్పకుండా కట్టాలని, పోలీస్ చలానాలు కట్టని వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఒక కోటి రూపాయల చలానాలు విధించడం జరిగిందని తెలియజేశారు.

వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి..

ఇక నుంచి వాహనాలకు ఇన్సూరెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ప్రజలకు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వంతో పోలీసులు అనేక విధాల ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించే ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా కృషి చేయాలని, త్వరలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా సీసీ కెమెరా ద్వారా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చలానాలు విధించడం జరుగుతుందని, చలానాలు ఎక్కువగా నమోదైన వాహనాలతో పాటు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, రూల్స్ బ్రేక్ చేసిన చలానాలు చెల్లించాలని సూచించారు. వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండటం ద్వారా అనేక లాభాలు చేకూరుతాయని తెలియపరిచారు. కార్యక్రమంలో జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, సీఐ, ఎస్ఐ లు ఉన్నారు.

Advertisement

Next Story