వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలి

by Shyam |   ( Updated:2020-08-12 08:21:55.0  )
వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలి
X

దిశ, పటాన్‌చెరు: కరోనా మహమ్మారి నుంచి కార్మికులను రక్షించడంతో పాటు, కరోనా బారిన పడ్డ కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలనితో కూడిన సెలవు ఇవ్వాలని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె.రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యాగ్వాల్స్ పరిశ్రమ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. కార్మికులకు కరోనా సోకిన, క్వారంటైన్‌లో ఉన్న కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, అన్నీ ఈఎస్ఐ డిస్పెన్సరీలో కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులందరికీ ప్రత్యేకంగా రూ.10 లక్షల భీమా చేయాలన్నారు. కరోనా ట్రీట్మెంట్ బాధ్యత యజమాన్యాలు తీసుకునేలా ప్రభుత్వం జీఓ వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్మిక కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed