కాంగ్రెస్‌కు షాక్.. మరో పార్టీలోకి ఆ నేత!

by Shyam |
కాంగ్రెస్‌కు షాక్.. మరో పార్టీలోకి ఆ నేత!
X

దిశ,వెబ్‌డెస్క్: టీపీసీసీ అధికార ప్రతినిధి పదవికి ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. పార్టీ వైఖరి నచ్చక పోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇన్నేండ్లుగా తనకు అండగా నిలిచిన కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. కొన్ని రోజులగా పార్టీలో సీనియర్ల తీరు తనను బాధ పెట్టిందన్నారు. ఓ మహిళ నేతగా తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. సీనియర్ల వైఖరికి నిరసనగా పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చానని చెప్పారు.

కాగా ఆమె వైఎస్ షర్మిళ పెట్టబోయే పార్టీలో ఆమె చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిళ అనుచరులతో ఆమె సమావేశం కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది.

Advertisement

Next Story