- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఒక్క పట్టభద్రుడు కూడా టీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దు’
దిశ, మహబూబాబాద్: ఏడేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా.. మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి కూడా జాడ లేదని మండిపడ్డారు. ఒక్క పట్టభద్రుడు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయొద్దని సూచించారు. ఉద్యోగుల ఫిట్మెంట్ 7శాతం నుంచి 43 శాతం పెరగాలంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దని, ఉద్యోగులు షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. మతతత్వ పార్టీ బీజేపీ అని హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తూ కొత్త బిచ్చగాళ్ల వలే ప్రవర్తిస్తుందన్నారు. భద్రాది రాముడి అభివృద్ధిపై వివక్ష చూపిస్తూ.. తెలంగాణ హిందువులను కించపరస్తోందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను బొంద పెట్టాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.