- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇన్నోవా మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర మోటార్(టీకేఎం) తన ఇన్నోవా క్రిస్టా మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ వేరియంట్ ధర రూ. 17.18 లక్షల నుంచి రూ. 20.35 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ రూ. 17.18-18.59 లక్షల మధ్య, డీజిల్ వేరియంట్ రూ. 18.99-20.35 లక్షల మధ్య నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. వినియోగదారుల కోసం తెచ్చిన ఈ ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌లో మల్టీ టెరైన్ మానిటర్‌తో పాటు హెడ్అప్ డిస్‌ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థ, వైర్‌లెస్ ఛార్జింగ్, డొర్ ఎడ్జ్ లైటీంగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు అందించామని కంపెనీ పేర్కొంది.
‘ఇప్పటికే ఉన్న ఇన్నో మోడల్ కోసం వినియోగదారుల నుంచి మెరుగైన డిమాండ్‌ను చూస్తున్నాం. ఎంపీవీ(మల్టీ పర్పస్ వెహికల్) విభాగంలో మరింత మంది వినియోగదారుల నుంచి ఆదరణను సంపాదించేందుకు, మారుతున్న వినియోగదారుల అభిరుచికి తగినట్టుగా దీన్ని రూపొందించాం. కొత్త మొబిలిటీ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ వాహనాన్ని అప్‌గ్రేడ్ చేశామని’ టీకేఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వైస్‌లైన్ సిగమని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఇప్పటివరకు 9 లక్షల ఇన్నో మోడళ్లను విక్రయించినట్టు కంపెనీ వెల్లడించింది.