- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP హెల్త్ మినిస్టర్ విడుదల రజినీ గురించి ఎవరికీ తెలియని నిజం!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హెల్త్ మినిస్టర్ విడదల రజనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే మంత్రి పదవి లభించడమే కాకుండా.. ఏకంగా తొలిసారే అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్యారోగ్య శాఖను నిర్వహిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమెను.. వేల మంది యువకులు, యువతులు ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో తన పర్యటనల వివరాలు, పాల్గొనబోతున్న కార్యక్రమాలను సంబంధించిన అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగాను పంచుకుంటారు. ముఖ్యంగా కరోనా కాలంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమెకు రెండు రాష్ట్రాల్లోనూ అభిమానులు పెరిగిపోయారు. కానీ, ఎవరికీ ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి సరిగా తెలియదు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆమె చిలూకలూరిపేట వద్ద ఉన్న పురుషోత్తమ పట్నంలో జన్మించలేదని.. ఆమె తెలంగాణ బిడ్డ అని వార్తలు విస్తృతమయ్యాయి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని అని తెలుస్తోంది. రజని మంత్రి కావడంతో కొండాపురం గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కింద చిలుకలూరిపేటకు వెళ్లారని, అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో రాజకీయాలపై ఆసక్తితో మొదట ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలుకలూరిపేట నుంచే రాజకీయాలు ప్రారంభించారు. అనతి కాలంలోనే వైఎస్ఆర్సీపీలో చేరి టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో హెల్త్ మినిస్టర్‌గా చోటు దక్కించుకున్నారు.