మహబూబ్ నగర్ టూ విశాఖపట్నం ట్రైన్ ప్రారంభం.. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Kalyani |
మహబూబ్ నగర్ టూ విశాఖపట్నం ట్రైన్ ప్రారంభం.. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్: శనివారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ నెంబర్ 12862 గల మహబూబ్ నగర్ టూ విశాఖపట్నం రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు, అలాగే కాచిగూడ-యశ్వంత్ పూర్, కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఆపేందుకు, అలాగే చెంగల్పట్టు-కాచిగూడ రైల్ ను షాద్ నగర్ స్టేషన్ లో ఆగేందుకు రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతానని ఆయన తెలిపారు.


పాలమూరు నుంచి విశాఖకు ట్రైన్ ను ప్రారంభించడం వలన ఆంధ్రప్రదేశ్ లోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వీలవుతుందని, అలాగే ఆ రాష్ట్రంతో సత్ససంబంధాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు 1400 కోట్ల రూపాయలతో రైల్వే డబ్బింగ్ లైన్ పూర్తి చేసి ఇటీవలే ప్రారంభించుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 1000 కి.మీ రైల్వే లైన్ వేయాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేసి ఇస్తే పనులు చేపడతామని ఆయన వివరించారు. గత 9 ఏళ్ళలో మహబూబ్ నగర్ లో జరిగిన అభివృద్ధిని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరిస్తూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పించాలన్నారు.

కేంద్ర టూరిజం శాఖ నుంచి జిల్లాకు నిధులు ఇప్పిస్తే టూరిజం పరంగా ఇంకా అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని తెలిపారు. పట్టణంలో వీరణ్ణపేట్ గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జీ, తిరుమలదేవుని గేటు దగ్గర ఆర్ఓబీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర రైల్వే గేటు మూసేయడంతో ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు‌. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామరావు, అదనపు ఎస్పీ రాములు, ఆర్డీఓ అనీల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మూడా చైర్మన్ గంజి వెంకన్న, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ తల్లోజు ఆచారి, కౌన్సిలర్ జె.నర్సింహులు, తహసీల్దార్ పాండు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story