కరోనా మహమ్మరితో వారి జీతాలకు ఢోకా లేదు

by Harish |
కరోనా మహమ్మరితో వారి జీతాలకు ఢోకా లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: 2008 సంక్షోభం నాటి స్థాయిలో గతేడాది కరోనా మహమ్మారి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అంతగా ప్రభావితం చేయలేదు. దీంతో 2021లో భారత కంపెనీలు టాప్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలను 6 శాతం పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ తెలిపింది. అయితే, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాల పెంపు శాతం 2020లో కంటే 1.4 శాతం తగ్గిందని అయాన్ నివేదిక అభిప్రాయపడింది. 20కి పైగా పరిశ్రమలకు చెందిన 504 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం..’ఎగ్జిక్యూటివ్ ఇంక్రిమెంట్‌లపై మహమ్మారి ప్రభావం ఊహించిన తీవ్రస్థాయిలో లేదు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల చాలా రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. అందుకే, ఈ రంగాల్లో ఎగ్జిక్యూటివ్ వేతనాలు భారీగా పెరిగాయని’ అయాన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రూపాంక్ చౌదరీ చెప్పారు. ‘భారత్‌లో ఎగ్జిక్యూటివ్‌లను చెల్లించే జీతాలు అమెరికా, యూరప్ కంపెనీలతో ముడిపడి ఉన్నాయి. భారత్‌లో సీఈఓలకు చెల్లించే పరిహారంలో సగానికిపైగా వ్యాపార పనితీరుతో ముడిపడి ఉంటుందని అయాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. సీఈఓల తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సేల్స్ హేడ్స్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్లు అత్యధిక పారితోషికాన్ని అందుకున్నారు. లీగల్ హెడ్, ఐటీ హెడ్ తక్కువ వేతనాలను పొందిన జాబితాలో ఉన్నారని అయాన్ అధ్యయనం తెలిపారు. భారత ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల విషయంలో ఆర్థిక సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగాలు ముందంజలో ఉన్నాయని అయాన్ వెల్లడించింది.

Advertisement

Next Story