సమ్మర్‌లో ‘తుఫాన్’.. ప్రైమ్ వెదర్ ఫోర్‌కాస్ట్

by Jakkula Samataha |
Toofaan
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ ‘తుఫాన్’ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసిన అమెజాన్ ప్రైమ్.. మార్చి 12న ట్రైలర్‌ను, మే 21న ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, ఫర్హాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇన్‌స్పైర్ చేస్తుందని, డ్రీమ్స్‌ అచీవ్ చేసే దిశగా మోటివేట్ చేస్తుందన్నారు దర్శకులు ఓంప్రకాశ్. ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో ఫర్హాన్‌తో పనిచేశాక ‘తుఫాన్’ కథానాయకుడిగా తనే పర్‌ఫెక్ట్ అని డిసైడ్ అయ్యానని తెలిపారు. తను ఈ చిత్రంలో యాక్ట్ చేయలేదని, పాత్రలో జీవించేశాడని అన్నారు.

‘తుఫాన్’ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుండగా.. ఈ బ్యానర్ ఇండియాలో సాగనున్న తమ జర్నీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నారు. అమెజాన్ ప్రైమ్ కంటెంట్ డైరెక్టర్ అండ్ హెడ్ విజయ్ సుబ్రమణియమ్.. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్‌తో లాంగ్ స్టాండింగ్‌ రిలేషన్‌ను గొప్ప సంపదగా భావిస్తున్నట్లు తెలిపారు. క్వాలిటీ ఎంటర్‌టైన్మెంట్ తీసుకురావడంలో భాగంగా ‘తుఫాన్‌’ను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్‌ను నిర్మించిన రితేష్ సిద్వాని, రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, ఫర్హాన్ అక్తర్.. ఈ చిత్రం ఆడియన్స్ హార్ట్ అండ్ సోల్‌‌ను టచ్ చేస్తుందన్నారు.

Advertisement

Next Story