- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదుకోవాలంటూ రజక వృత్తిదారుల నిరసన
దిశ, హైదరాబాద్: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వృత్తి, ఉపాధి కోల్పోతున్న రజక వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఇంటి వద్ద నుంచే నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో 17 జిల్లాల వ్యాప్తంగా 250 కుటుంబాలు తమ వృత్తి పరికరాలతో ఆందోళన చేసినట్టు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా వృత్తి ఉపాధి కోల్పోయిన రజక కుటుంబాలకు రూ.10 వేలు ఇవ్వాలని, అలాగే రూ. 25 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లాండ్రీ దుకాణాలు, దోబీ ఘాట్లకు కరెంట్ బిల్లు మాఫీ చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఖాళీగానున్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం వృత్తి ఆధారిత రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. రాష్ర్ట అధ్యక్షుడు గుమ్మడిరాజు నాగరాజు, ఉపాధ్యక్షుడు గుమ్మడి రాజు నరేష్, ఎం. బాలకృష్ణ, వడ్డేమాను శ్రీనివాస్ , సిహెచ్ ముసలయ్య, చెరుకు పెద్దులు, సహాయ కార్యదర్శలు జ్యోతి, ఉపేందర్ తదితర నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.