- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధోనిసేన వర్సెస్ కోహ్లీసేన… ఈ రోజు చరిత్రలో నిలిచిపోనుందా..?
దిశ, వెబ్ డెస్క్ : IPL 2021 లో భాగంగా 35వ మ్యాచ్ లో నేడు RCB జట్టుతో CSK జట్టు తలపడనుంది. అయితే సరిగ్గా ఇదే రోజున 2007, సెప్టెంబర్ 24న టీ20 ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడి మొదటి ప్రపంచకప్ ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు. ప్రపంచకప్ ఫైనల్ లో ధోని చేసిన అద్భుత వ్యూహాలతో మ్యాచ్ ను ఎలా మలుపు తిప్పాడో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా చివరి ఓవర్ లో ధోని తీసుకున్న నిర్ణయంకు యావత్ ప్రపంచం ఆశ్చర్యంకు గురైంది.
తన వ్యూహంతో మ్యాచ్ ని మలుపు తిప్పి జట్టుని విజయతీరాలకు చేర్చి భారత్ కు ప్రపంచకప్ ను అందించాడు. మళ్లీ సరిగ్గా అదే రోజున ధోని నాయకత్వంలో CSK జట్టు బరిలోకి దిగనుండడంతో కోహ్లీ సేనకు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం చాలానే ఉంది. ఇది వరకే RCB జట్టు పేలవమైన ప్రదర్శనతో తంటాలు పడుతోంది. వరుస విజయాలతో ఊపు మీదున్న CSK జట్టుని కోహ్లీసేన ఏ విధంగా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సివుంది.