- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో తాజాగా 42 పాజిటివ్ కేసులు
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఒక్క రోజే కొత్తగా 42 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 37 మంది, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, మరో ముగ్గురు వలస కూలీలకు కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితులు 1,551 మందికి చేరుకున్నారు. మొత్తం కేసుల్లో 947 మంది పురుషులు, 566 మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పటి వరకూ 992 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 525 మంది చికిత్స పొందుతున్నారు.
అన్ని వయసుల్లోనూ పురుషులే అధికం
రాష్ట్రంలో కరోనా బాధితుల్లో వయసుల వారీగా పరిశీలిస్తే.. స్ర్తీలకంటే పురుషులే ఎక్కువ మంది కరోనా బారిన పడినట్టు గణంకాలు చెబుతున్నాయి. 15 ఏళ్లలోపు వారిలో 97 మంది బాలికలు, 121 మంది బాలురు, 16-30 ఏళ్ల వయసు వారిలో 182 మంది స్త్రీలు, 252 మంది పురుషులు, 31-45 ఏళ్ల వారిలో పురుషులు-258, స్ర్తీలు-148, 46-60 ఏళ్ల వారిలో పురుషులు-208, స్త్రీలు-93, 60ఏళ్లు పైబడిన వారిలో పురుషులు-106, స్ర్త్రీలు-45 మంది ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.