ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభన

by Anukaran |   ( Updated:2020-08-31 08:52:05.0  )
ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. రోజుకీ కరోనా కేసులు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 10,004 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి 85 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,969కు చేరింది. తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా 4,34,771 కేసులు రికార్డు అయ్యాయి. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 3,30,526 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1,00,276 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో స్పష్టం చేసింది.

Advertisement

Next Story