- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్మీ.. సెలబ్రిటీలకు ఏ మాత్రం తక్కువ కాదు
దిశ, ఫీచర్స్:శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో ‘ఆర్మీ’ ప్రధానపాత్ర పోషిస్తే.. టీకాపై అవగాహన కల్పిస్తూ ‘కరోనా’ మహమ్మారి నుంచి బార్డర్ సైనికులనే కాదు దేశ పౌరులను కూడా కాపాడుకోవడానికి ‘ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్మీ’ ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్ తీసుకుంటే ప్లాట్ ఫ్రీ, బీర్ ఫ్రీ ఇవ్వడంతో పాటు భారీ క్యాష్ ప్రైజ్‌లు అందించిన అమెరికా ప్రభుత్వం విజయవంతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగించింది. అయితే టీనేజ్ (12-18) వయసు పిల్లల్లోనూ వ్యాక్సిన్‌పై అవేర్‌నెస్ తీసుకురావడానికి, వాటిపై ఉన్న అపోహలను తొలగించడానికి టిక్‌టాక్, ఇన్‌స్టా, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో వైట్‌హౌజ్ జతకట్టింది.
ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ‘సెలబ్రిటీ’లతో చెప్పిస్తే చాలా తక్కువ టైమ్‌లో రీచ్ అవుతుంది. అంతేకాదు ఆ ఇన్ఫర్మేషన్ సహేతుకమైందని, నమ్మదగినదని జనాలు భావిస్తారు. అందుకే మహమ్మారి సమయంలో ఆయా ప్రభుత్వాలు ప్రముఖుల సాయం తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాయి. అయితే స్టార్స్‌తో పాటు కొవిడ్ సమయంలో సోషల్ మీడియా బిగ్ పార్ట్ పోషించగా, మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్స్, నెటిజన్ల పాత్రను కూడా మరవలేం. అయితే సెలబ్రిటీలతో పోల్చితే, లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కూడా భారీ ఫాలోయింగ్ ఉంటుంది.
ప్రతిరోజూ తమ సబ్‌స్కైబర్స్‌తో టచ్‌లో ఉంటుంటారు. దాంతో అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియాలో టీకాకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను ఖండించడానికి, యువతలో వ్యాక్సిన్ అవగాహన కల్పించేందుకు ట్విచ్ స్ట్రీమర్, యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాకు చెందిన 50మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఓ ఆర్మీని సిద్ధం చేసింది. ఈ తరహా ప్రయత్నం ఇప్పటిది కాదు ప్రజల్లో పోలియో వ్యాక్సిన్ అవగాహన కల్పించేందుకు 1956 లోనే ‘ది ఎడ్ సుల్లివన్ షో’ ద్వారా ప్రజారోగ్య అధికారులు ప్రజల్ని చేరుకోవడానికి ప్రముఖులను ఉపయోగించారు. ఈ రోజుల్లో, యువత మెయిన్ స్ట్రీమ్ సెలబ్రిటీల కంటే తమ అభిమాన కంటెంట్ సృష్టికర్త సలహాలను విశ్వసించే అవకాశం ఉందని మార్కెటింగ్ ఏజెన్సీ మ్యూస్‌ఫైండ్ 2018 అధ్యయనం వెల్లడించింది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సర్వే ప్రకారం 18- 39 ఏళ్ల వయసున్న అమెరికన్లలో వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కాగా 50 కంటే ఎక్కువ వయసున్న వారికి మూడింట రెండు వంతులకు పైగా టీకాలు వేశారు. 12 – 17 ఏళ్ల యువతలో 58 శాతం మంది ఇంకా షాట్ తీసుకోలేదు. దీనికి యాంటి వ్యాక్సినేటర్స్ కారణమని వెల్లడించింది. సోషల్ మీడియా వ్యాప్తంగా టీకా మీకు హాని కలిగిస్తుందని, టీకా వల్ల అనారోగ్యం వస్తుందనే సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు, వ్యాక్సిన్ వ్యతిరేక హ్యాష్‌ట్యాగ్ డ్రైవ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోని వ్యాక్సిన్ నెగిటివిటీని తగ్గించే ప్రయత్నంలో ఇన్‌ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్‌లు అడవి మంటలో ఒక స్ప్రింక్లర్‌గా ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు వస్తున్నాయని వైట్‌హౌజ్ డిజిటల్ టీమ్ ప్రతినిధులు తెలిపారు.
“టీకా ప్రాముఖ్యతను ప్రచారం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి నష్టం మరల జరగకూడదు. నా క్యాంపెయిన్ వల్ల టీకా తీసుకుని ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఎస్. ఫౌసీతో టీకాల గురించి ప్రశ్నోత్తరాల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. వ్యాక్సిన్ తర్వాత డ్రింక్ చేయొచ్చా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గర్భవతి కావడం గురించి మనం ఆందోళన చెందాలా? ‘పీరియడ్ సమయంలో టీకా తీసుకోవద్దని ఎక్కువగా ప్రచారం అవుతుంది? అందులో నిజముందా? వంటి ప్రశ్నలను ఫౌసీని అడిగాను. అవన్నీ అపోహలే అంటూ ఆయన సమాధానమిచ్చారు”
– ఎల్లీ జైలర్(17), టిక్‌టాకర్ (10మిలియన్ల ఫాలోవర్), హైస్కూల్ విద్యార్థిని
వ్యాక్సిన్ అనుకూల సందేశాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు ఈ ఆర్మీని రూపొందించాం. తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి ఇంతకన్నా మరో ఉత్తమ మార్గం లేదు. జనవరి నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాం. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేశాం. 16.6 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న మెక్సికన్ నటుడు యూజీనియో డెర్బెజ్‌తో కలిసి ఓ లైవ్ స్ట్రీమ్ వీడియోను ఫౌసీతో రూపొందించాం. అందులో తాను తీసుకున్న వ్యాక్సిన్, కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా రక్షించలేదా అంటూ డెర్బెజ్ అడిగ్గా, వేరియంట్ల నుండి పూర్తిగా రక్షించలేవని, కానీ తీవ్రమైన అనారోగ్యం నుంచి మిమ్మల్ని రక్షించడంలో ఇది చాలా సాయపడుతుందని డాక్టర్ ఫౌసీ సమాధానమిచ్చాడు. ఇలా కంటెంట్ క్రియేటర్స్ కూడా తమ తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న ఫొటోలను, చేతిపై వాటి ముద్రలను చూపిస్తున్నారు. వీరి క్యాంపెయిన్ కోసం నెలకు $ 400 నుండి $ 1,000 వరకు కేటాయిస్తున్నాం. – క్లార్క్ హంఫ్రీ, వైట్ హౌస్ కొవిడ్ -19 డిజిటల్ డైరెక్టర్
“డాక్టర్ ఫౌసీతో కలిసి లైవ్ స్ట్రీమ్ వీడియో చేశాను. ఇందులో టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయనే తప్పుడు పుకారును తొలగించేందుకు ప్రయత్నించాను. ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ వ్యాక్సిన్ అవేర్‌నెస్ వీడియోలు చేశాను. అందరి సందేహాలను డాక్టర్ ఫౌసీతో సమాధానం అందించే ప్రయత్నం చేశాను. నా ఫాలోవర్స్ అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. వారంతా టీకాలు వేసేకునే వరకు ఈ క్యాంపెయిన్ చేస్తూనే ఉంటాను”
– క్రిస్టియానా నజ్జర్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్
- Tags
- influencers