- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీదీ 'గోరుచుట్టుపై రోకటి పోటు'.. మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ
దిశ,వెబ్‌డెస్క్: బెంగాల్ లో మహా యుద్ధానికి బీజేపీ, టీఎంసీలు సిద్ధమయ్యాయి. ముచ్చటగా మూడోసారి బెంగాల్ లోకి రావాలని మమతా బెన్జరీ ప్రయత్నిస్తుంటే.., ఎలాగైనా బెంగాల్ ఉట్టు కొట్టాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ‘మా- మాటి-మనుష్’ (తల్లి, మట్టి, ప్రజలు) నినాదానికి ధీటుగా సోనార్ బంగ్లా, ప్రగతి శీల్ బంగ్లా నినాదాన్ని తెరపైకి తెచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తుంటే అసెంబ్లీలో ఆ పప్పులుడవక్ అంటున్నారు దీదీ. ఇంతకీ బెంగాల్ దంగల్ లో విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ.. అక్కడి అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్.. ఆ పార్టీ ఎంపీలు చేస్తున్న పనులు విమర్శలు మూటగట్టుకుంటోంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఎంపీ కల్యాణ్ బెనర్జీతో పాటూ ఎమ్మెల్యే అలోక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కల్యాణ్ బెనర్జీ..తమ పార్టీకే చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం అంటూ ఎంపీ బుగ్గ గిల్లుతున్న వీడియోల్ని బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ట్వీట్‌పై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. 25 ఏళ్లుగా ఆమెను చెల్లిగా చూసుకుంటున్నా. నీ డర్టీ మైండ్‌ను బయటపెట్టుకున్నావ్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పశ్చిమ్ బెంగాల్ లో ఈ బుగ్గగిల్లుడు రాజకీయం దీదీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టిందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
TMC empowering women…?
This is TMC MP Kalyan Banerjee and the woman is outgoing Bankura MLA who was miffed for not getting a ticket.
Shame! pic.twitter.com/JUXsZerN6i
— Locket Chatterjee (@me_locket) March 9, 2021