న‌వంబ‌రు నుంచి ఆన్‌లైన్లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు

by srinivas |
న‌వంబ‌రు నుంచి ఆన్‌లైన్లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో నవంబరు నుంచి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార‌ సేవ‌ల‌ను వర్చ్యువల్ విధానంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ నిరోధక మార్గదర్శకాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవ‌లు పొందిన భ‌క్తులకు ఆ టికెట్టుపై శ్రీ‌వారి దర్శనం ఉండ‌దు.

శ్రీ‌వారి దర్శనం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో టికెట్లు పొందొచ్చు. ప్రస్తుతం సాయంకాలం నిర్వహించే సహస్ర దీపాలంకార సేవ‌ను భక్తుల కోరిక మేరకు ఆల‌యం బ‌య‌ట నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి ఆల‌యానికి చేరుకుంటారు. ఈ సేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సంప్రదాయ దుస్తుల్లో సేవలను వీక్షించాలి. సేవల్లో పాల్గొనే భక్తుల గోత్ర నామాల పట్టికను శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.

Advertisement

Next Story

Most Viewed