- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం రింగ్ రోడ్ నా కల.. నా సంకల్పం.. తుమ్మల మనస్సులో మాట
దిశ, ఖమ్మం రూరల్: ‘ఖమ్మం రింగ్ రోడ్ నా కల…..నా సంకల్పం’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మంలోని తన నివాసంలో పాలేరు ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా కలిసినపుడు ఎన్నో సంచలన విషయాలు తుమ్మల నేతలతో పంచుకున్నారు. ఖమ్మం నగరానికి రింగ్ రోడ్ ఏర్పాటుతో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరంగా ఖమ్మం మారనుందని అన్నారు. ఇరవై ఏండ్ల క్రితం ఖమ్మం పట్టణానికి బైపాస్ రోడ్ మొదలు పెడితే…మంత్రా మజాకా… అనే వార్తలతో నాటి ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేశారని, కానీ ఈనాడు అదే బైపాస్ ఖమ్మానికి ఆయువుపట్టులా మారిందనన్నారు. బైపాస్ లో గజం 50 వేల నుంచి లక్ష దాకా భూములు ధరలు పెరిగాయని నేతలు తుమ్మల గారికి చెప్పడంతో,అవును ఎక్కడైనా వసతులు ఉంటేనే కదా లైఫ్ స్టైల్ మారేదని తుమ్మల వారితో తన అనుభవాలను పంచుకున్నారు.
సిఎం కేసీఆర్ తో తనకున్న స్నేహం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని టీఆర్‌ఎస్‌లో చేరానని, తనపై నమ్మకంతో మంత్రిని చేయగా.. ప్రతిక్షణం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకారంతో బాటలు వేసానని తుమ్మల నాయకులకు చిట్ చాట్ గా చెప్పడంతో పాటు కొన్ని సంచలన విషయాలు తన అంతరంగంలో దాగిన విషయాలు నేతలతో పంచుకున్నారు.
అడవిలో ఉన్న ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కోసం కొండలపైన నివాసం ఉన్న కొండరెడ్లను నాగరిక సమాజంలోకి తేవడం కోసం ఏజెన్సీలో విద్య, వైద్యం దక్కని ఆదివాసీలు గిరిపుత్రుల కోసం ఏజెన్సీలో వాగులు వంకలు నదులపై వంతెనల కోసం కూనవరం తాలిపేరు హై లెవల్ బ్రిడ్జిలతో మన్యం ప్రగతిబాట చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతిఒక్కరి అభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా పని చేయడం జరిగిందన్నారు.