మూడు వాహనాలు డీ..డ్రైవర్లకు తీవ్రంగా గాయాలు..

by Shyam |   ( Updated:2021-12-17 11:43:37.0  )
మూడు వాహనాలు డీ..డ్రైవర్లకు తీవ్రంగా గాయాలు..
X

దిశ, చారకొండ: మండల పరిధిలో ఉన్న జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై తిమ్మాయి పల్లి గ్రామ పరిధిలో శుక్రవారం రెండు డీసీఎంలు, లారీ ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లకు గాయాలైనాయి. సంఘటన పై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి వైపు నుండి దేవరకొండ వైపు వెళ్తున్న రెండు డీసీఎం‌లు ముందుగా డీ కొన్న ఆదే సమయంలో వెనుకనుండి లోడుతో వస్తున్న మరో లారీ డీసీఎం‌ను డీ కొట్టింది. దీంతో డీసీఎం, లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ప్రమాదంలో డ్రైవర్లు గాయాలతో బయటపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనీవాసులు పోలీసు సిబ్బంది‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో డీ కొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను ప్రక్కకు తొలగించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు.

Advertisement

Next Story