డిప్యూటీ కలెక్టర్లుగా ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు

by Shyam |
డిప్యూటీ కలెక్టర్లుగా ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ముగ్గురు సచివాలయ సెక్షన్ అధికార్లను డిప్యూటీ కలెక్టర్లుగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటేరియేట్‌లో సెక్షన్ అధికారులుగా పనిచేస్తోన్న ఎస్.శ్రీను, ఇ.మల్లయ్య, ఆర్.పాండులను డిప్యూటీ కలెక్టర్లుగా నియమిస్తూ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. వారు తెలంగాణ సచివాలయంలో 2017లో సెక్షన్ ఆఫీసర్లుగా రిలీవ్ అయినట్లు పేర్కొన్నారు. ఈమేరకు వారి సర్వీసు రిజిస్టర్లను రూపొందించాలని సీసీఎల్ఏను ఆదేశించారు.

Advertisement

Next Story