- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కాటుకు బలైన కుటుంబం
దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో కరోనా విలయతాడవం చేస్తుంది. కరోనా కారణంగా గత పది రోజులుగా కోదాడ పట్టణంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలోని కెఎల్ ఆర్ కాలనీలో నివాసముండే ఒక కుటుంబంలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. వివరాల ప్రకారం.. కెఎల్ ఆర్ కాలనీలో నివాసముండే కాంట్రాక్టర్ ఓరుగంటి వెంకటేశ్వర్లు (52) కుటుంబంలో ఆయనతో ఆయన తల్లిదండ్రులకు పది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో వారు చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరారు. అక్కడ రెండు లక్షలు పెట్టి కి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర్లు తల్లి అంజమ్మ మృతి చెందగా, శనివారం ఉదయం ఆయన తండ్రి రంగయ్య మృతి చెందాడు. కాగా, శనివారం సాయంత్రం వెంకటేశ్వర్లు కూడా మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్వర్లు టీఆర్ ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. ఆయన మృతి పట్ల కోదాడ నియోజకవర్గానికి పలువురు టీఆర్ ఎస్ నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.