- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైలో మూడు రైల్వే ప్రమాదాలు.. ఒకరు మృతి
by Shamantha N |
X
ముంబయిలో బుధవారం ఒకేరోజున నిమిషాల వ్యవధిలోనే మూడు రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదాలన్నీ ముంబ్రా స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వే స్టేషన్ వైపునకు వెళ్లే లోకల్ ట్రైన్లలోనే జరిగాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఓవర్ లోడ్ కారణంగా, ఫుట్ బోర్డ్ ను పట్టుకుని వేలాడటం వల్లే ట్రైన్లో నుంచి జారిపడ్డారని వెల్లడించారు. మృతుడు ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, గాయపడిన ఇద్దరూ స్థానికులేనని తెలిపారు. క్షతగాత్రులు కల్వా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, ఇప్పటికైనా ముంబై లోకల్ రైళ్లలో రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story