రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి

by srinivas |   ( Updated:2021-04-16 00:35:53.0  )
రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గణపతి కోల్డ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గణపతి కోల్డ్ స్టోరేజీ వద్ద సిమెంట్ లారీ, మిర్చి లారీ ఒకదానికొకటి క్రాస్ చేయబోయి స్వల్పంగా ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లు వాహనాలు పక్కన ఆపి వాగ్వాదానికి దిగారు. గామలపాడు గ్రామస్థులు వచ్చి వీరితో మాట్లడుతున్న క్రమంలో వెనుక నుంచి మరో సింమెంట్ లారీ వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గామాలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి సీతారామయ్య, ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

Next Story