- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Huzurabad : ఓటర్లకు భారీ షాక్.. ఆ మూడ్రోజులు ‘చుక్క’ లేనట్టేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉపఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారపర్వం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో భారీగా డబ్బుల పంపిణీ జరిగినట్టు తెలిసింది. అందుకు సంబంధించి రుజువులు కూడా బయటకు వచ్చాయి. సీల్డ్ కవర్‌లో ఓటుకు రూ.6వేల చొప్పున మంత్రి హరీశ్ రావు అనుచరులు నగదు పంపిణీ చేస్తున్నట్టు జోరుగా వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే పోలింగ్‌కు ఇంకా ఒకటిన్నర రోజుల గడువు ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్‌లో గురువారం సాయంత్రం 7 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 28న సాయంత్రం నుంచి వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, మిలిటరీ క్యాంటీన్లు, మద్యం డిపోలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, దుకాణాలు తీసినా కఠిన చర్యలుంటాయని ఆదేశించారు. కాగా, పోలింగ్ తేది వరకు మద్యం షాపులు ఓపెన్ ఉంటే ఓటర్లను ప్రలోభానికి గురిచేసే అవకాశం ఉందని, దీంతో మద్యం ఏరులై పారుతుందని భావించిన జిల్లా పాలనాధికారి ముందస్తుగానే క్లోజ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.