వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అనారోగ్య సమస్యలు

by vinod kumar |
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అనారోగ్య సమస్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా.. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. లాంగ్ టైమ్ లో ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎక్కువ కాలం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది వర్క్ -లైఫ్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుందని వారంటున్నారు. ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, సరైన పొజిషన్ లో కూర్చొకపోవడం కూడా వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది.

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అనగానే చాలా మంది ‘మన చేతిలో ఎక్కువ సమయం’ ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఇంటి నుంచి ఆఫీసు వెళ్లడం లేదు కాబట్టి .. ట్రావెలింగ్ టైమ్ సేవ్ అయ్యిందని, రెడీ కావాల్సిన టైమ్ కూడా సేవ్ అవుతుందని ఆలోచిస్తారు. ఇది చాలా మందిలో ఉన్న అపోహ. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే.. ‘వర్క్ హౌవర్స్’ కంప్లీట్ గా మారిపోయాయి. నైన్ టూ ఫైవ్ (9-5) రోజులు పోయాయి. జాబ్ ఇన్ సెక్యూరిటీ పెరిగిన కొద్దీ.. వర్క్ ప్రెజర్ కూడా అంతకంతకు పెరుగుతుంది. బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్.కామ్ (స్లీప్ సొల్యుషన్ స్టార్టప్) చేసిన సర్వే ప్రకారం 67శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ సరిగా నిద్ర పోవడం లేదని తేల్చింది.

వర్చువల్ బర్న్ అవుట్:

వర్క్ ఫ్రమ్ హోమ్ లో చాలా మంది వర్చువల్ గా కమ్యూనికేట్ అవుతున్నారు. మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడంతో పాటు, కొలిగ్స్, సబ్ అర్డినేట్ లతో చేయాల్సిన పనులపై మాట్లాడుతున్నారు. మన మెదడు ‘వర్చువల్ ఇంటారాక్షన్’ కోసం తయారు చేసింది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనుషులతో, జంతువులతో వర్బల్, నాన్ వర్బల్ పరంగా మన మెదడు కమ్యూనికేట్ అవుతుంది. కానీ డిజిటల్ కమ్యూనికేషన్ వల్ల మెదడు పై ఎక్కువ భారం పడుతుందని సైకాలాజిస్ట్ దిశా దేశాయ్ చెబుతున్నారు. దీనివల్ల అలసటతో పాటు ఆవేశం కూడా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఆందోళన పెరగడంతో పాటు, డిప్రెషన్ కు దారితీస్తుందని, మెంటల్ హెల్త్ పై ప్రభావం పడుతుందని ఆమె చెబుతోంది. అందువల్ల ఈ సమయంలో ప్రొడక్టివిటి పై ఎంత ఫోకస్ చేస్తామో.. పీస్ ఆఫ్ మైండ్, మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం అంతే అవసరమన్నారు.

కూర్చునే విధానం సరిగా లేకపోతే:

ఆఫీసులో పని చేసే విధానానికి, ఇంట్లో పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆఫీసులో మనకుంటూ ఓ డెస్క్, కంఫర్టబుల్ చెయిర్ ఉంటాయి. కానీ ఇంట్లో ఆ సౌకర్యాలు ఉండచ్చు, ఉండకపోవచ్చు. చెయిర్స్ కంఫర్టబుల్ లేకపోతే బ్యాక్ పెయిన్, షోల్డర్, నెక్ పెయిన్స్ కు దారీ తీస్తుంది. ‘సరైన విధానంలో కూర్చొకపోతే’ (పూర్ సిట్టింగ్) ఇది కూడా పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. సరైన పొజిషన్ లో కూర్చొకపోతే ఊపిరి తీసుకునే విధానంలో మార్పు వస్తుందని, దాని వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తో పాటు, జీర్ణక్రియలో మార్పులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇవే కాకుండా నెక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్, తలనొప్పి, చేతులు, వేళ్ల నొప్పులు పెరుగుతాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది.

ఇవి చేయకూడదు:

– ఒకే భంగిమ(posture)లో ఎక్కువ సేపు కూర్చొకూడదు.
– కంప్యూటర్ పై వర్క్ చేస్తున్నప్పుడు ‘వంగి’ చేయకూడదు.
-డెస్క్ టాప్/లాప్ టాప్/మొబైల్ ఏదైనా కంటికి, లేదా భుజానికి సరిసమానమైన ఎత్తులో ఉండాలి.
-సోఫా మీద కూర్చుని పని చేయకూడదు. దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి.
– మోకాళ్లపై కూర్చుని పని చేయవద్దు.
– విరామంలో లేదా.. ఉదయం, సాయంత్రం సమయాల్లో యోగా, చిన్న పాటి ఎక్సర్ సైజులు చేస్తుండాలి.
– ప్రతి 20 నిముషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి.
– బ్రీతింగ్ టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయాలి
– ఏలాంటి కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులు వచ్చిన వైద్యుడ్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు, సూచనలు తీసుకోవాలి.

Advertisement

Next Story