కాళేశ్వరంలో తొలి ఏకాదశి పూజలు..

by Sridhar Babu |   ( Updated:2021-07-20 06:39:12.0  )
kaleshawaram
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో మంగళవారం గోదావరి ప్రధాన పుష్కర ఘాట్ వద్ద భక్తులు త్రివేణి సంగమంలో తొలి ఏకాదశి స్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వాదిలారు. అయితే, కాళేశ్వరం గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించడంతో దక్షిణ కాశీగా పేరు గాంచిన కాళేశ్వరముక్తీశ్వర స్వామి వారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో భక్తులకు తొలి ఏకాదశి పండుగ రోజున స్వామి వారి దర్శన భాగ్యం లేకపోవడంతో నిరాశ ఎదురైంది. స్వామి వారి తూర్పుద్వారం రాజగోపురం వద్ద ఉన్న లింగం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

గోదావరిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

కాళేశ్వరం గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గోదావరి నది ఒడ్డున పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా మిర్యాలగూడకు చెందిన దుంపల్లి నారాయణ రెడ్డి అనే వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని కాపాడారు. అయితే, ఇంట్లో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి రోజున చనిపోతే మంచిది అని భావించి, ఈరోజు కాళేశ్వరం గ్రామానికి వచ్చి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు నారాయణ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించారు.

kaleshawaram-Worship

Advertisement

Next Story

Most Viewed