- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ బాతు ఈకల ధర.. మూడున్నర లక్షల పైమాటే
దిశ, ఫీచర్స్ : తొలకరి చినుకులు పడగానే కృష్ణా జిల్లాలోని వజ్రపుగుట్టల సమీపంలో వజ్రాల వేట కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. ఇక్కడే కాదు కర్నూల్, అనంతపురం జిల్లాల్లోని పొలాల్లోనూ వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఇక గుజరాత్‌లోని సూరత్ నగరం బంగారం షాపులకు ప్రసిద్ధి. అక్కడి స్థానికులు, స్వీపర్స్.. ఆ దుకాణాలున్న వీధుల్లోని మట్టిని జల్లెడ పట్టి బంగారు రేకులు, చిన్నిచిన్ని ముక్కలను పోగేసుకుంటారు. ఇదేవిధంగా ప్రతీ వేసవిలో దాదాపు 400 మంది హంటర్స్.. ఐస్‌లాండ్, బ్రెయిజాఫ్‌జూర్‌జూర్ బేలోని ఒక చిన్న, మారుమూల ద్వీపంలో అసాధారణమైన నిధి కోసం వెతుకుతారు. అయితే అదేదో బంగారం, వజ్రాల నిధి అనుకుంటే పొరపాటు.. కేవలం బాతు ఈకల కోసమే వారి అన్వేషణ.
ఐస్‌లాండ్‌లో మాత్రమే కనిపించే ‘ఈడర్ పొలార్’ బాతుల ఈకలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే నాణ్యమైన, నేచురల్ ఫైబర్.. ఈ బాతు ఈకల్లోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దాంతో వీటికి మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. 800 గ్రాముల ఈకల ధర రూ. 3,71,150 ($ 5,000) కంటే ఎక్కువ ఉండగా, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఈకలుగా ఇవి పేరుగాంచాయి. అందువల్లే కొంతమంది హంటర్స్ ప్రతీ సంవత్సరం ఈకల సేకరణకు ప్రయత్నిస్తుండగా.. వందల సంవత్సరాలుగా ఈ వేట కొనసాగుతోంది.
ఈ ఈకలతో దుస్తులు, బ్యాగులు, దుప్పట్లు, క్విల్ట్స్ తయారు చేస్తున్నారు. కేవలం లగ్జరీ ఉత్పత్తులను తయారు చేయడానికే వీటిని ఉపయోగిస్తున్నారు. ఈడర్ పొలార్ బాతులు పొదిగే సమయంలో గుడ్లను ఇన్సులేట్ చేయడానికి తమ గూళ్ళలో ఈకలను వరుసలో ఉంచుతాయి. అలా గూళ్లలో పెట్టిన ఈకలను హంటర్స్ సేకరించి అమ్ముకుంటారు. ఇది కొంతమందికి జీవనోపాధిగా మారిపోయింది. ఈ మేరకు కిలో ఈకలను దాదాపుగా 60 గూళ్ల నుంచి సేకరిస్తారు.