- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RC16 కోసం సరికొత్త లుక్‌లో గ్లోబల్ స్టార్.. ఆ ఫొటోను షేర్ చేస్తూ దర్శకుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. యంగ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తిని కనబరిచింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే చరణ్ తన కొత్త సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఆర్సీ 16(RC16) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి దర్శకుడు సాలీడ్ అప్డేట్ను ఇచ్చారు.
ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్‌ని పిలిపించారు. ఆయన రామ్ చరణ్ సరికొత్త హెయిర్ స్టైల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్, అకీమ్ హకీమ్‌తో దిగిన ఫొటోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు చరణ్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.