- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోల్స్ రాయిస్ మినియేచర్ కారు@ 19 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: కార్లలో రోల్స్ రాయిస్ కార్ల రేంజ్ వేరన్న విషయం తెలిసిందే. కాస్ట్ పరంగానే కాదు.. లగ్జరీ, ఫీచర్స్ విషయంలోనూ రోల్స్ రాయిస్ కారు టాప్‌ప్లేస్‌లో ఉంటుంది. 2019లో వచ్చిన రోల్స్ రాయిస్ ‘కలినన్’ మోడల్ ధర 3,25,000 డాలర్లు(దాదాపు రూ.2.45 కోట్లు). మినియేచర్ కార్లు రూపొందించే ఓ వ్యక్తి ఈ హైఎండ్ కారుకు రెప్లికా(నకలు) తయారు చేశాడు. అయితే దాని ధర కూడా ఓ కారు ధరంత ఉండటం విశేషం. రియల్ రోల్స్ రాయిస్‌కు ఎనిమిదో వంతులో ఉండే ఈ చిన్ని కారు ధర 27,000 డాలర్లు(దాదాపు రూ.19 లక్షలు) కావడం గమనార్హం. ఈ మినియేచర్ కారు రూపొందించడానికి దాదాపు 1000 విడి భాగాలను వాడారు. దీన్ని తయారు చేసేందుకు మినియేచర్ ఎక్స్‌పర్ట్‌కు దాదాపు 450 గంటలు పట్టింది. వాస్తవానికి యాక్చువల్ రోల్స్ రాయిస్ కారు చేయడానికి కూడా ఇంత టైమ్ పట్టదు. ఎక్స్‌టీరియర్ లైట్స్‌తోపాటు అన్నీ యాక్సెసరీస్‌ను ఈ రిచ్ వర్తీ టాయ్ కారుకు అమర్చారు. కాగా ఈ మినియేచర్ రోల్స్ రాయిస్ కలినన్ మోడల్ కార్లు దాదాపు 40 వేల విభిన్నమైన రంగుల్లో లభించనున్నాయి. 26 సెంటిమీటర్లు పొడవు, 10 సెంటిమీటర్ల వెడల్పు, 9 సెంటీమీటర్ల ఎత్తుతో ఉండే ఈ కార్లు పూర్తిగా హ్యాండ్‌మేడ్ కావడం విశేషం.