ఇదే తొలిసారి..!

by Shyam |

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రతీ ఏటా ప్రభుత్వం ఘనంగా పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించేది. కానీ, ఈ సంవత్సరం నిరాడంబంరంగా జరగనున్నాయి. లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. నేడు ఉదయం సీఎం కేసీఆర్ 8.30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆయనకు అక్కడ స్వాగతం పలుకనున్నారు. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండదు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో ప్రసంగం లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది.!

Advertisement

Next Story