- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా థర్డ్ వేవ్ మొదలు.. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలోనే వ్యాపారాలు, మాల్స్, కాంప్లెక్స్‌లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికీ ప్రజలు మాస్క్ లు లేకుండా బయటికి రాకూడని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మళ్లీ థర్డ్ వేవ్ మొదలుకానునట్లు తెలియడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి రాష్ట్రంలో లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్ మొదలయ్యింది. వెల్గటూర్ మండలం ఎండపల్లిలో గత రెండు రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు.. కరోనా కేసుల సంఖ్య 12కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన గ్రామ పంచాయితీ మరోసారి లాక్ డౌన్ అమలుచేస్తునట్లు ప్రకటించింది.
పది రోజుల పాటు అనగా జూలై 19వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకులాక్ డౌన్ విధిస్తున్నట్లు, ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని.. ఆ తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నిబంధలను ఉల్లంఘించిన దుకాణ యజమానులకు 5 వేల రూపాయల జరిమాన విధిస్తామని తెలిపారు. అలాగే గుంపులుగా తిరిగినా, మాస్క్ ధరించకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. గ్రామంలో కరోనా నియమ నిబంధలతో ఉన్న పోస్టర్లు సైతం అతికించారు. ప్రస్తుతం ఆ పోస్టర్లు వైరల్ గా మారాయి.