- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొసైటీ చైర్మన్ పై పినతల్లి చీటింగ్ కేసు..
దిశ, తల్లాడ : స్వయాన పినతల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకులో నకిలీ అకౌంటు ద్వారా రూ.లక్షన్నర డబ్బులను డ్రా చేసి మోసానికి పాల్పడిన తల్లాడ మండలం కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ఏ.ప్రదీప్ రెడ్డి పై బుధవారం రాత్రి తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పూర్తి వివరాల ప్రకారం తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరుతో డీసీసీబీ బ్యాంకులో నకిలీ అకౌంట్ తెరిచి రూ.లక్షన్నర డబ్బులను కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ఏ. ప్రదీప్ రెడ్డి కజేశాడంటూ అతని పినతల్లి వేమిరెడ్డి పద్మావతి తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
2008 వ సంవత్సరం నుంచి ఎల్ఐసీ ఇన్సూరెన్స్ కట్టుకొని పొదుపు చేసుకోగా ఎల్ఐసి డబ్బు 2019కి మెచ్యూరిటీ అయింది. ఎల్ఐసీ నుంచి తనకు వచ్చిన రూ.లక్షన్నర చెక్కును ప్రదీప్ రెడ్డి తీసుకొని తల్లాడలోని డీసీసీబీ బ్రాంచ్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఖాతాను తెరిచి చెక్కులు ఆ ఖాతాలో జమ చేసి తదుపరి అతను అకౌంట్ ను రద్దు చేశాడని, ఇది జరిగినప్పుడు తాను అమెరికాలో కుమార్తె వద్ద ఉన్నట్లు వివరించారు. బ్యాంకు సిబ్బంది సహకారంతో డబ్బులు కాజేశారని పద్మావతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బి.కొండలరావు తెలిపారు.