Rupee : ‘యూఎస్ ఫెడ్’ ఎఫెక్ట్.. ఆల్ టైం కనిష్ఠ స్థాయికి రూపాయి

by Hajipasha |
Rupee : ‘యూఎస్ ఫెడ్’ ఎఫెక్ట్.. ఆల్ టైం కనిష్ఠ స్థాయికి రూపాయి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆల్ టైం కనిష్ఠ స్థాయికి భారత రూపాయి(Indian Rupee) పతనమైంది. అమెరికా డాలరు(US dollar)తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ తొలిసారిగా రూ.85కు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లకు తగ్గించినందు వల్లే రూపాయి ఇంతగా ప్రభావితమైందని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరిన్ని సార్లు వడ్డీరేట్లను తగ్గించనుందనే భయాలు కూడా కరెన్సీ మార్కెట్‌ను వెంటాడుతున్నాయని తెలిపారు.

గురువారం ఉదయం కరెన్సీ ట్రేడింగ్ ప్రారంభం కాగానే రూపాయి మారకం విలువ రూ.85.06 రేంజును తాకింది. మన రూపాయితో పాటు ఇతరత్రా ఆసియా దేశాల కరెన్సీలు సైతం డీలాపడ్డాయి. మలేషియాకు చెందిన రింగిట్, ఇండోనేషియాకు చెందిన రూపియా, దక్షిణ కొరియాకు చెందిన వన్ కరెన్సీలు సగటున 0.8 శాతం నుంచి 1.2 శాతం మేర డౌన్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed