- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
317GO : 317జీవోపై ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు
దిశ, వెబ్ డెస్క్ : 317జీవోపై శాసన మండలి(Legislative Council)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 317జీవో సమస్యలపై ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, కవిత, జీవన్ రెడ్డి, ఏవీఎన్ రెడి, వాణిలు వివరించారు. కవిత మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పడు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల మేరకు 317జీవో తీసుకరావడం జరిగిందని, అందులో సమస్యలుంటే అధికారంలోకి వచ్చిన మీరు పరిష్కరించకుండా ఇంకా మాపై నిందలెందుకని ప్రశ్నించారు. 317జీవోను ఆనాడు విమర్శించిన కోదండరాం ఇప్పుడు రెండుమూడు జిల్లాలకు ఎఫెక్టు అయ్యిందన్నారని, ఆనాడు తెలంగాణ అంతా బాధపడుతుందని మాట్లాడారని గుర్తు చేశారు. కొంతమందికి జీవోతో ఇబ్బంది ఏర్పడితే వాటిని ప్రభుత్వమే పరిష్కరించాలన్నారు. కోదండరాం స్పందిస్తూ ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ దీంతో సమస్యలు ఏర్పడ్డాయన్నారు.
ప్రెసిడెన్షియల్ మార్పు చేయడమే శాశ్వత పరిష్కారం : మంత్రి శ్రీధర్ బాబు
కేంద్రహోంశాఖ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మార్పులతోనే 317జీవో వివాదాలకు శాశ్వత పరిష్కారమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో అశాస్త్రీయంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారని విమర్శించారు. దీంతో ఉద్యోగుల స్థానికత, సీనియార్టీలపై వివాదాలు రేగాయని, నాలుగు జిల్లాలకు కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 317జీవో రద్దు చెద్దామన్న మళ్లీ కొత్త సమస్యలొస్తాయన్న ఆందోళన ఉందన్నారు. 317జీవోను ఉద్యోగులు మరణ శాసనంగా భావించారన్నారు. రాష్ట్ర ఉద్యోగుల ఫౌజు సమస్యలతో పాటు సెంట్రల్ ఎంప్లాయిస్ ఫౌజు కేసులపై కూడా నిర్ణయం తీసుకోవాల్సిఉందన్నారు. 317జీవో బాధితులకు న్యాయం చేసేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. దరఖాస్తుల వడపోత తర్వాత ప్రస్తుతం 32వేలకు పైగా దరఖాస్తులు ఉన్నాయన్నారు. 12మార్లు ఇప్పటికే సబ్ కమిటీ సమావేశమైందని, స్థానికత వివాదంగా మారిందని, అడ్వకేట్ జనరల్ తో ఐదు సార్లు భేటీ అయ్యామని, శాస్త్రీయంగా సమస్య పరిష్కారం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సర్వీస్, పదోన్నతుల పరిరక్షణకు గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 2018లో తీసుకొచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులో ఉండేంత వరకు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కొన్ని వెసులుబాటుతో 317జీవో కు సంబంధించి వివిధ శాఖల పరధిలోని కొన్ని వందల దరఖాస్తులు పరిష్కరించామని వెల్లడించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 317జీవోతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని వివరిస్తూ అటువంటి వాటిని కొనసాగేలా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.