Mandhula Samel : రోజుకో వేషంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డ్రామాలు : మందుల సామేల్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-19 05:46:39.0  )
Mandhula Samel : రోజుకో వేషంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డ్రామాలు : మందుల సామేల్
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ(Assembly)కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)లు రోజుకో వేషంతో డ్రామా(Dramas)లు వేస్తూ చిందు కళాకారుల భాగవతాలను తలపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్(Mandhula Samel)ఎద్దేవా చేశారు. పదేళ్లు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు రోజుకో వేషం వేస్తూ నాటకాలు వేయడం సిగ్గుచేటన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇసుక దోపిడి, భూదోపిడిలతో సర్వం దోచుకున్నారని.. ఏనాడు ఆటో డ్రైవర్లను, రైతులను, ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఏ ఆటో డ్రైవర్లను ఇండ్లకు రానివ్వలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు 34మంది చనిపోయాక వారిష్టమొచ్చిన విధానాలు తెచ్చిన నియంతలని దుయ్యబట్టారు. ఇవ్వాళ అధికారం పోయాక రైతు వేషం, ఆటో డ్రైవర్ల వేషం కడుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, మీ డ్రామాలు ఇక బంద్ చేయాలని సామేల్ చురకలేశారు.

ఎంతసేపు శాసన సభను అడ్డుకోవాలని, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ కాలువలపై ఇచ్చిన హామీలు విస్మరిస్తే, ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక బునాదిగాని కాలువకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 267కోట్లు మంజూరు చేసి 98కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలవడం పట్ల, కేతిరెడ్ది కాలువకు 13కోట్లు మంజూరీ చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఎర్రబాడు దొరలకు చెందిన భూములకు సంబంధించిన వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed