మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు..

by Sumithra |
మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు..
X

దిశ, ఇంద్రవెల్లి : మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మాల మహానాడు నాయకులను ముందుస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి వాగ్మారే కామరాజ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారిన అదే తీరు కొనసాగుతోందన్నారు. మాల మహానాడు నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ వైఖరినే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు భామ్నె శ్రీరామ్, మాస్కే రాజవర్దన్, సోన్ కాంభ్లే సూరజ్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed