రష్మికతో డేటింగ్.. స్పందించిన రౌడీ బాయ్.. అప్పుడే బయటపెడతానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
రష్మికతో డేటింగ్.. స్పందించిన రౌడీ బాయ్.. అప్పుడే బయటపెడతానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు జంటగా ‘డియర్ కామ్రెడ్’, ‘గీత గోవిందం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆన్ స్క్రీన్‌లో వీరి యాక్టింగ్‌తో అలరించిన ఈ జంట ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే రూమర్ ఎప్పటినుంచో నెట్టింట షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు వేకెషన్స్‌కి వెళ్లడం, పలు హోటల్స్‌లో కలిసి తినడం, రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లడం, మరిది(వరసకు) ఆనంద్ దేవరకొండతో పలు ప్రమోషన్స్‌లో తమ బాండింగ్ గురించి చెప్పడం అన్ని చూస్తుంటే ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లు అయింది. అయితే ఈ రూమర్స్ పై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు. అయితే తాజాగా తమ డేటింగ్ పుకార్లపై రౌడీ బాయ్ స్పందించారు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. ‘దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుందో అప్పుడే నేను బయట పెడతా. దీని కోసం ఓ సందర్భం రావాలి. నేను ఒక నటుడిని కావడంతో నా జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీనిపై నెటిజన్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేశావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed