- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: కావ్య చేసిన వంటను అద్భుతం అంటూ పొగిడేసిన రాజ్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దుగ్గిరాల వారి ఇంట్లో వారందరూ తింటూ ఉంటారు. కావ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అసలు దీనిలో ‘ఉప్పుఉందా చప్పుడు కూడు మాకు పెట్టాలనుకున్నావా?’ అంటూ ధాన్యం, రుద్రాణీ ఇద్దరూ కావ్యపై కోపం చూపిస్తూ ఉంటారు. ఏం చేద్దాం .. కొందరికీ ఉప్పుతిన్నా విశ్వాసం ఉండటం లేదు.. అందుకే కొంచం తగ్గించి ఉంటుంది ’అని అపర్ణా దేవి ఆ ఇద్దర్ని తిడుతూ ఉంటుంది.. ఇక పులిహోర కలపడమే పనిగా పెట్టుకున్న రాజ్ అబ్బా " కళావతి వంటలు అదిరిపోతున్నాయి ఇంకా అబ్బా పెట్టు పెట్టు’ అని తింటుంటాడు.
ఇక రాజ్ తింటూనే ‘అయ్యో ఇదేంటి ఉప్పు తక్కువగా ఉంది’ అని అనుకుంటూ ఉంటాడు.. పైకి మాత్రం ‘అద్భుతం అమోఘం’ అంటూ పొగిడేస్తుంటాడు. అంతా అలా చూస్తూ ఉంటారు. ‘పోనీలే నీకైనా విశ్వాసం ఉంది రాజ్’ అని ఇందిరా దేవి అంటుంది. రాజ్‌కి ఏం అర్థం కాక.. అలాగే చూస్తూ ఉంటాడు.
‘విశ్వాసం ఏంటి నాన్నమ్మా’ అని అంటాడు. అలా కాదులేరా నువ్వు తిను అని అంటుంది. ఇక ధాన్యం, రుద్రాణీ ఇద్దరూ కోపంగా.. చూస్తారు. అదేంటి రాజ్ నీకు టేస్ట్ లేదా.. వంటల్లో ఉప్పు తక్కువగా ఉంటే అలా పొగుడుతావేంటీ?’ అని సూటిగా అడిగేసరికి షాక్ అవుతాడు. కవర్ చేసుకోవడానికే చాలా ప్రయత్నిస్తాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.