- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెట్టాలి : అదనపు కలెక్టర్
దిశ, కొల్చారం: నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం కొల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను అదనపు కలెక్టర్ నగేష్ స్థానిక తహసీల్దార్ గఫర్ మియాతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కిచెన్ గదిని, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లో అదనపు కలెక్టర్ పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని, భోజనం తయారు కోసం నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ,కేర్ టేకర్ లు భోజనం వండే సమయాలలో, విద్యార్థులు భోజనం చేసే సమయాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాలల్లో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం కోసం తయారు చేసిన వంట పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. వంట వండే సిబ్బంది చూసి శుభ్రతతో ఉండాలని సూచించారు. డైనింగ్ హాల్ , కిచెన్ షెడ్ లో అపరిశుభ్ర వాతావరణంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రత పాటించాలని ప్రిన్సిపాల్ కు ఆదేశించారు.లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యవతి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.