బస్సులను పునరుద్దరించాలి.. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా..

by Sumithra |
బస్సులను పునరుద్దరించాలి.. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా..
X

దిశ, భద్రాచలం : భద్రాచలం ఆర్టీసీ డిపో నుండి వివిధ ప్రాంతాలకు రద్దు చేసిన బస్సులను తిరిగి పునరుద్దరించాలని కోరుతూ, సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలం బస్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ కూకట్ పల్లిలకు రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను మళ్ళీ నడపాలని, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రైవేటు బస్సులు నిలిపేందుకు అనుమటించకూడదని, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలకు ఆంధ్ర వైపు ఆర్టీసీ సర్వీసులు పెంచాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పది రోజుల్లో రద్దు చేసిన బస్సులను పునరుద్ధరిస్తామని డిపో మేనేజర్ తిరుపతి రావు సీపీఎం నాయకులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story