- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP High Court: వైసీపీ నేత క్వాష్ పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) సోషల్ మీడియా(Social Media)లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan), నారా లోకేష్(Minister Nara Lokesh) లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత(YCP Leader) సజ్జల భార్గవ్ రెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ రెడ్డికి తాజాగా ఏపీ హైకోర్టు(AP High Court)లో మరోసారి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను నేడు(గురువారం) హైకోర్టు విచారించింది.
భార్గవరెడ్డి(Sajjala Bhargav Reddy) తరఫున సీనియర్ న్యాయవాది(Senior Advocate)పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత లేని కేసు అని ఆయన కోర్టుకు తెలిపారు. ఎవరి పై అయితే పోస్టులు పెట్టారో.. వారు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఐటీ సెక్షన్స్ కు బదులుగా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని అన్నారు. ఈ క్రమంలో, బీఎన్ఎస్ సెక్షన్ 35 (3)కి అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు(AP High Court) ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. దీంతో భార్గవరెడ్డి పై అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.