Leopard : గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి

by Y. Venkata Narasimha Reddy |
Leopard : గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణాజిల్లా(Krishna District) గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి(Leopard) మృతి(Dies) కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది. ఇది చూసిన రైతులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

తమ ప్రాంతంతో చిరుతపులి సంచరించడం..అది ఉచ్చులో చిక్కి మరణించడంతో మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి మృతి ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరిపి వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed