- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరుపదుల వయసులో రాణిస్తున్న నారీమణులు
దిశ, ఫీచర్స్: యువతీ యువకులకే కాదు వాళ్లకి దేహముంది, ఆ దేహానికి మనసు మాత్రమే కాదు, గొంతు కూడా ఉంది. వారికంటూ ఓ స్టైల్ ఉండటమే కాదు, వాళ్లకు మాత్రమే సొంతమైన అపార అనుభవముంది. వారికీ అభిప్రాయాలు, ఆంతరంగిక విషయాలు, కోరికలు, ఇష్టాలు ఉన్నాయి. అంతేకాదు వారికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంతకీ వాళ్లెవరు అంటారా? ఆరు పదులు దాటిన ఇండియన్ ఉమన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. వాళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు యంగ్ ఫ్యాషనిస్ట్స్‌కు మాత్రమే పరిమితమైన ఇన్‌స్టా వేదికపై తమవైన గ్రౌండ్ బ్రేకింగ్ పోస్టులతో కొత్తగా ప్రవేశించేవారిని ప్రభావితం చేయడమే కాకుండా మరింత మంది వృద్ధ మహిళలను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మార్చడానికి దోహదం చేస్తున్నారు. ఈ వయసులో ఇలా మాత్రమే చేయాలంటూ సమాజం గీసిన సరిహద్దులు చెరిపేసి తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తూ సరికొత్త ప్రపంచానికి బాటలు వేస్తున్నారు.
ప్రతి ఏడాది మన దేహానికి ఓ నెంబర్ యాడ్ అవుతుంది దాన్ని ‘వయసు’ అని అంటారు. కొందరికీ ఆ సంఖ్య అడ్డంకిగా మారుతుందేమో, కానీ ఉరకలు వేసే హృదయానికి, తమ గుర్తింపును చాటి చెప్పాలనుకునే వ్యక్తులకు మాత్రం ఆ నెంబర్ లెక్కలోకి రాదు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎంతోమంది నిరూపించగా, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రాణిస్తున్న వృద్ధ మహిళలు ఆ విషయాన్ని మరోసారి చాటిచెబుతున్నారు. పెయింటింగ్స్, డ్రెస్సింగ్, ఫ్యాషన్ టిప్స్, డ్యాన్స్, జీవిత అనుభవాలు, రుచికరమైన వంటలు వాట్ నాట్ అన్నట్లు తమవైన టిప్స్ అందిస్తున్నారు.
మంజ్రీ వర్దే
హీరోయిన్ సమీరారెడ్డి అత్తగా 64 ఏళ్ల ‘మంజ్రి వర్దే’ సుపరిచితమైనా, పెయింటింగ్స్, డివైఐ (DIY- do it yourself) ఆర్ట్ మేకింగ్ స్కిల్స్‌తో అందర్నీ ఆమె ఆకట్టుకుంటోంది. సమీరా రెడ్డితో కలిసి వీడియోలు చేయడంలో, స్పోర్ట్స్ ఆడటంలోనూ ఆమె ప్రతిభ మనల్ని వావ్ అనిపిస్తుంది. ఆమె వేసే పెయింటింగ్స్, కవితలు, కాలిగ్రాఫీ ఆమె సృజనాత్మక ప్రపంచం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆమె నేటి కాలానికి తగ్గట్లు రెడీ కావడంలో ఇప్పటికీ యూత్‌కు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. మన సమాజంలో అత్త-కోడలు అంటేనే ఓ నెగెటివిటీ మనల్ని చుట్టుముడుతుంది. ఆ నెగెటివ్ భావజాలాన్ని ముక్కలు చేస్తూ ‘సమీరా-మంజ్రీ’ అనుబంధం మనకో కొత్త వైబ్రేషన్ అందించడమే కాకుండా అత్తా కోడళ్లు కలిసి ఉంటే జీవితం ఇంకెంత బాగుంటుందో అని అనిపించక మానదు. ‘మనవైన కోరికలు తీర్చుకోవడానికి ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు, ఏదీ ఆలస్యం కాలేదు, ఇంకా ఎంతో సమయముంది. అవకాశం లేకపోయినా సృష్టించుకుని ముందుకు వెళ్లండి.’ అని మంజ్రి అంటున్నారు. ఆమెను 70.7 వేల మంది ఫాలో అవుతున్నారు.
రజినీ చాంది
65 ఏళ్ల వరకు హోమ్ మేకర్‌గా ఉన్న రజనీ చాందీ..‘ఒరు ముతస్సి గాథ’ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ ఫేమ్‌తో మలయాళ బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొంది. ఎప్పుడూ చక్కటి చీరకట్టులో, సంప్రదాయ వస్త్రధారణలోనే కనిపించే ఆమె, ఒక్కసారిగా మోడ్రన్ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొని, వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ కావడంతోపాటు ట్రోలింగ్‌కు గురయింది. ‘నాకు నచ్చినట్లుగా ఉంటాను, నాకు ఆనందాన్ని అందించే పని చేస్తాను. వృద్ధ వయసు మహిళ అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారు. మీరు ఎవరినీ బాధించనంత కాలం మీకు కావలసినది చేయడం సరైందేనని నేను నమ్ముతున్నాను’ అంటూ విమర్శకులకు గట్టిగానే సమాధానమిచ్చింది. ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా, ఆమె తన మేకోవర్ షూట్ పట్ల చాలా పాజిటివ్‌గా ఉంది. అంతేకాదు ఆమె తన ఇన్‌స్టా వేదికగా ఫొటోలు పంచుకుంటూ ‘సంవత్సరాలు గడిచేకొద్దీ మహిళ అందం పెరుగుతోంది’ ‘మనల్ని సంతోషపరిచే వ్యక్తులతో కలిసి ఉండండి’ ‘ఇట్స్ నాట్ హౌ ఓల్డ్ యూ ఆర్, ఇట్స్ హౌ యూ ఆర్ ఓల్డ్’ వంటి ఇన్‌స్పిరేషన్ కోట్స్ పెడుతూ, వృద్ధ మహిళల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయడంతోపాటు, సమాజ మూస ధోరణులతో బ్రేక్ వేస్తోంది. 11.9 వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
పద్మావతి దువా
డాక్టర్ పద్మావతి దువాగా అందరికీ తెలిసినా, ఇంటర్నెట్ ప్రపంచం మాత్రం ఆమెను చిన్నా దువాగానే గుర్తుపెట్టుకుంటోంది. మెడికల్ డాక్టర్, సింగర్, పాషనేట్ కుక్, సారీ వీవర్, వ్లాగర్‌గా ఆమె ప్రతిభ మాటల్లో చెప్పలేం. చీరల సెలెక్షన్స్‌పై ఆమెకున్న పట్టు ఇంకెవరికీ లేదేమో అనిపిస్తోంది. భారతీయ చేనేత గురించి ఆమె అందించే కథనాలు రియల్లీ సూపర్బ్. మహిళలు ఎవరైనా సరే.. మ్యాచింగ్ సారీ, బ్లౌజ్, బిందీ పెట్టుకోవడంలో తికమక పడుతుంటే.. ఒక్కసారి ఆమె ఇన్‌స్టా చూస్తే సరిపోతుంది. ‘ఆనందాన్ని కలిగించే పనిని మనం ఎందుకు చేయకూడదు? సెల్ఫ్ లవ్ మనకు చాలా ముఖ్యం. మనల్ని మనం ప్రేమించకపోతే, ప్రపంచం మనల్ని ఎలా ప్రేమిస్తుంది. ఏ విషయాన్ని అయినా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అంతం లేదు. నా వయసు 60 కావచ్చు, కానీ నా మనస్సులో ఇంకా 16 ఏళ్లే’ అని పద్మావతి అంటోంది. ఇక పద్మావతి కూతురు మల్లికా దువా కమెడియన్‌గా రాణిస్తోంది. ఇన్స్‌స్టాలో చిన్నా దువాను 37.2 వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
పూనమ్ సప్రా
పూనమ్ సప్రా ఫాలోవర్స్ ఆమెను ‘మదర్ విత్ సైన్’ అని పిలుస్తారు. ‘ఇట్స్ ఓకే టూ సే ఐయామ్ ఓకే’ ‘పాజ్.. బిఫోర్ యూ స్పీక్ హార్ష్‌లీ’ ‘బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్’ ‘వాట్ ఈజ్ యువర్ మదర్ ఫేవరేట్ సాంగ్’ ఇలా ఆలోచనలు, ఉపాయాలు, కోట్స్, సజేషన్స్, సామెతలు అన్నీ ఆమె చేతులతో పట్టుకున్న కార్డ్‌బోర్డ్‌పై కనిపిస్తాయి. ఆ కార్డ్ బోర్డ్‌పై ఉన్న అక్షరాలే మనలో ఆలోచనలు రేకెత్తిస్తాయి, ప్రశ్నిస్తాయి, పరిష్కారాన్ని చూపెడుతాయి. అందుకే తన ప్రొఫైల్‌ను సందర్శించే ప్రతి ఒక్కరికీ సప్రా ‘ఆన్‌లైన్ మదర్ పాత్ర’ను పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమెను 156 వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
రవిబాలశర్మ
62 ఏళ్ల రవిబాలశర్మ తనదైన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. స్వతహాగా ఉపాధ్యాయురాలైన శర్మ, రిటైర్మెంట్ తర్వాత డ్యాన్సర్‌గా, తబలా వాయిద్యురాలిగా పేరు తెచ్చుకుంటోంది. తన సంతోషం కోసం కొత్త మైలురాళ్లను ఏర్పరుచుకుంటూ ఎందరో వృద్ధ మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ టెరెన్స్ రవిబాలశర్మ డ్యాన్స్‌ను మెచ్చుకున్నాడు. వీళ్లే కాదు ఆరు పదుల దాటిన మహిళలు ఎంతోమంది సోషల్ మీడియాలో యువతకు పోటీగా నిలుస్తున్నారు. అద్భుతాలు చేస్తూ, ప్రతిభకు వయసు, సమాజ ధోరణులు అడ్డుకాదనే విషయాన్ని చాటి చెబుతున్నారు. సో డియర్ ఉమన్స్..జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అండ్ డ్రీమ్స్.