‘ఎమ్మెల్సీ’ నామినేషన్.. రేపే చివరి అవకాశం

by Shyam |
graduate MLC nominations
X

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ నెల 23తో ముగియనుంది. చివరి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సోమవారం భారీగా నామినేషన్లు వచ్చాయి. మహబుబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానానికి సోమవారం ఒక్కరోజే 47 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 90కి చేరుకుంది. సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో టీఆర్ఎస్ నుంచి సురభి వాణీదేవి, బీజేపీ నుంచి ఎన్.రాంచంద్రర్ రావు, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ నామినేషన్ పత్రాలను ఆర్‌ఓకు అందించారు. వీరితో పాటు సామల వేణు, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి నిబంధనల ప్రకారం నామినేషన్ వేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆమెకు మంగళవారం కల్పించాలని మరో అవకాశం కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed