బిగ్ డీల్స్ లేనట్టేనా?

by Shamantha N |   ( Updated:2020-02-19 01:20:02.0  )
బిగ్ డీల్స్ లేనట్టేనా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశముందని అందరు ఊహించారు. కానీ, ఈ పర్యటనకు ముందే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ పర్యటనలో భారత్‌తో భారీ ఒప్పందాలు ఉండబోవన్న సంకేతాలను ఇచ్చారు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. భారత్‌తో బిగ్ డీల్స్‌ను వాయిదా వేసుకుంటున్నాం. అవి కూడా నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే ఉంటాయా? లేదా? అన్నదీ చెప్పలేనని అన్నారు. కానీ, కచ్చితంగా ఇండియాతో భారీ ఒప్పందాలు ఉంటాయని తెలిపారు. ఈ ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. భారత్ తమతో తగిన విధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. కానీ, భారత పర్యటనపై ఆసక్తిని, సంతోషాన్ని ప్రకటించారు.

ఈ నెల 24వ, 25వ తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. భారత్‌తో ఒప్పందాల్లో కీలకంగా ఉండే రాబర్ట్ లితిజర్ కూడా ట్రంప్‌ పర్యటనలో ఉండబోరని తెలిసింది. ఈ పర్యటనకు ముందు అమెరికాకు భారత్ కొన్ని వాణిజ్యపరమైన సౌలభ్యాలను కల్పించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారత పౌల్ట్రీ, డెయిరీ మార్కెట్‌లోకి అమెరికా ఎంట్రీకి పచ్చజెండా ఊపింది.

http://www.dishadaily.com/actor-brahmaji-son-sanjay-s-o-pitta-katha-movie/

Advertisement

Next Story

Most Viewed