- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో హైఅలర్ట్
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా భయం.. రాష్ట్రంలో కరోనా నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం హైలెవల్ కమిటీ సమావేశం ప్రభుత్వం నిర్వహించింది. ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా లక్షణాలతో నగరానికి వచ్చిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మరణించడంతో ఆయన ఎవరెవరిని కలిశారని ఇప్పుడు విచారణ చేస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆ వ్యక్తి సంచరించడంతో ఎంతమందికి కరోనా సోకిందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు వైద్యం చేసిన వారిని ఒంటరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వారందరినీ గుర్తించి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంటర్ పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిలోనే వైరస్ లక్షణాలు ఉండటం వారి నుంచే ఇతరులకు వ్యాపిస్తుండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్కడ 200 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది. ఎయిర్‌పోర్ట్‌లోఅన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే వారిని భయటకు పంపించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దనీ, వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు సహకరించాలని కోరారు.
సూపర్ మార్కెట్, మెట్రోపై అస్పష్టత..
హైలెవల్ కమిటీ షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసివేత గురించి ప్రకటించింది. కానీ, సూపర్ మార్కెట్, మెట్రో సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిటీలో పలు ప్రముఖ రిటైల్ సంస్థలూ మూసివేయాలని తమకు ఎలాంటి ఆదేశాలేమీ అందలేదని స్పష్టం చేశాయి. నిత్యం సుమారు 4 లక్షల మంది ప్రయాణించే మెట్రోపైనా ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. నగరంలో మెట్రో ప్రయాణీకులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఏ ఒక్కరిలో కరోనా లక్షణాలు ఉన్నా మెట్రో ప్రయాణీకుల్లో వేల మందికి అది వ్యాపించే అవకాశం ఉంది.
Tags: corona(covid-19), telangana govt, high level committee