- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా అదును చూసి సైబర్ దోపిడీ
దిశ, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలవుతుండగా మరోవైపు సైబర్ నేరస్తులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. చార్మినార్‌కు చెందిన డాక్టర్ షేక్ సమద్ అబ్డుల్లా మాస్కుల కొనుగోలు కోసం అలీబాబా వెబ్‌సైట్‌ను విజిట్ చేశాడు. ఇంతలోనే ఆయనకు
ఆగంతకుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తామూ అలీబాబా వెబ్‌సైట్ ద్వారానే మాస్కులు విక్రయిస్తున్నామని చెప్పాడు. ఆగంతకుడి మాటలు నమ్మిన డాక్టర్ 50 బాక్సుల మాస్కులు కావాలని కోరారు. అందుకు రూ. 15 లక్షలు అవుతుందని, ముందుగా 30 శాతం అడ్వాన్స్ చెల్లించాలని ఆగంతకుడు డాక్టర్‌కు తెలిపారు. దీంతో షేక్ సమద్ వెంటనే ఆ ఆగంతకుడు సూచించిన బ్యాంకు అకౌంట్‌కు రెండు విడతల్లో రూ. 4.11 లక్షలు పంపించాడు. ఆ తర్వాత నుంచి ఆగంతకుడి ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంతో దిక్కుతోచని స్థితిలో ఆ వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు.
Tags: Theft, Cyber criminals, corona masks, doctor, hyderabad