దొంగతనంలో కొవిడ్ ప్రోటోకాల్

by Anukaran |
దొంగతనంలో కొవిడ్ ప్రోటోకాల్
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగులు ముందుగా సొమ్ము దోచుకోలేదు. కరోనా వైరస్ భయంతో శానిటైజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ రివాల్వర్ తీసి షాపు యజమానిని బెదిరించి బంగారం, నగదు అపహరించారు. యూపీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ దొంగతనం జరిగింది. నగరంలోని బంగారం షాపుకు వచ్చిన దొంగలు యజమాని నుంచి ముందుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. కొవిడ్ ప్రోటోకాల్ పాటించి మరీ.. మెల్లగా గన్ తీసి బెదిరింపులు చేశారు. వెను వెంటనే షాపులోని బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఈ వీడియో మొత్తం సీసీటీవీ పుటేజీలో రికార్డు అయింది. బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. దొంగతనంలో కూడా కొవిడ్ ప్రోటోకాల్ పాటించడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed