- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలితీసిన ఆన్‌లైన్ చాటింగ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆన్ లైన్ చాటింగ్ యువకుడి ప్రాణాలను బలిగోంది. ఉరు పెరు తెలియని యువతితో ఫోన్‌లో చేసిన వీడియో చాటింగ్ రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించి డబ్బులు గుంజేందుకు యత్నించడంతో యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణంకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం అలస్యంగా వెలుగు చూసింది.
నవిపేట్ మండలం కోస్లీ గ్రామ ఉపసర్పంచ్ విఠల్ తనయుడు శ్రీకాంత్. హైద్రాబాద్‌లోని పంజాగుట్టలో క్షత్రియ హోటల్ మెనేజ్ మెంట్ సంస్థలో హోటల్ మెనేజ్ మెంట్ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో శ్రీకాంత్ కు ఒక గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన శ్రీకాంత్ సదరు నెంబర్‌కు కాల్ చేశాడు. నాటి నుంచి యువతి, శ్రీకాంత్‌ల దోస్తానా వీడియా కాలింగ్ వరకు వెళ్లింది. దానితో ఇద్దరు ఒకరినోకకు నగ్న వీడియాలను షేర్ చేసుకునే వరకు వెళ్లింది. కానీ, యువతి ఆ వీడియోలను రికార్డ్ చేసి తన గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీకాంత్‌ను బ్లాక్ మెయిల్ చేసింది.
నీ నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, పెట్టకుండా ఉండాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను స్టూడెంట్‌ను అని తన వద్ద అంత డబ్బులేదని, తన అకౌంట్‌లో ఉన్న 24 వేలను యువతి చెప్పిన అకౌంట్‌కు పంపించాడు. కానీ యువతి గ్యాంగ్ మాత్రం లక్షల్లో డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించింది. దీంతో సోషల్ మీడియాలో పెడితే పరువు పోతుందని ఈ నెల 27న హైద్రాబాద్ నుంచి నెరుగా కోస్లీలోని తమ పోలం వద్ద పురుగుల మందు తాగి అత్మహత్య యత్నం చేశాడు. ఉదయం పూట పోలానికి వెళ్లిన తండ్రి అక్కడ శ్రీకాంత్‌ను అపస్మారక స్థితిలో చూసి ముందుగా నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడినుంచి హైద్రాబాద్ కు తరలించారు. హైద్రాబాద్ లో చికిత్స పోందుతు మంగళవారం రాత్రి యువకుడు మరణించాడు. దీనిపై పోలిస్ లు కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నారు.