భర్తకి కరోనా సోకిందని భార్య ఏం చేసిందో తెలుసా

by Sridhar Babu |   ( Updated:2021-04-14 05:56:05.0  )
భర్తకి కరోనా సోకిందని భార్య ఏం చేసిందో తెలుసా
X

దిశ, వెబ్ డెస్క్ : భార్య భర్తల ఇరువురికి వ్యాధి సోకడంతో భర్తకు తీవ్ర ప్రాణాపాయ పరిస్థితి నెలకొనడంతో ఆబాధను భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పట్టణం లోని హనుమాన్ బస్తీలో నివాసముండే సుద్దాల జలజ, మొండయ్య దంపతులిరువురికి కరోన వ్యాధి ఈ నెల మొదటి వారంలో సోకినట్లు నిర్ధారణ కావడంతో ఇంట్లో ఉండి వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు.

సుద్దాల మొండయ్య సింగరేణి కార్మికుడు కావడంతో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న కారణంగా వ్యాధి తీవ్రం కావడంతో సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. శ్వాసకోశ ఇబ్బందులు తీవ్రతరం కావడంతో గాంధీ ఆస్పత్రి యాజమాన్యం సైతం కిమ్స్ హాస్పిటల్ కు అత్యవసర చికిత్స నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది. అయితే మొండయ్య భార్య జలజ ఇంట్లో ఉండి వ్యాధి నివారణ చికిత్సలను తీసుకుంటూ తీవ్ర మానసిక వేదనకు గురవడం, ఇరుగు పొరుగు వారికి సైతం కరోన వ్యాధి సోకినట్లు తెలియడంతో భౌతిక దూరం పాటించడం భర్తకు సైతం వ్యాధి నయమవుతుందో లేదో అనే బెంగ తీవ్రతరం కావడంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లోనే చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story